సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలోకలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు , కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి.కొండారెడ్డి మాట్లాడుతూ కొత్త ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ శాఖలలో ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీతాలు ఇవ్వాలని , రెగ్యులర్‌ చేయాలని, ప్రతినెల వేతనాలు సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు ప్రతి నెల ఏడో తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లాఅధ్యక్ష , కార్యదర్శులు కాలం సుబ్బారావు, ఎం.రమేష్‌, నాయకులు తంగిరాల మహేష్‌, ఎం.సురేష్‌, కె.రాజు , పి.ఆంజనేయులు, ఇశ్రాయేలు, సత్యనారాయణ, బ్రహ్మయ్య, సామ్రాజ్యం, కుమారి, కల్పన, బివి.రావు తదితరులు పాల్గొన్నారు

➡️