అంబేద్కర్ జయంతి సందర్భంగా కాల్దారి లో రక్తదాన శిబిరం

Apr 15,2025 16:00 #blood bank, #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ, జయంతి ని పురస్కరించుకుని, మండలంలోని కాల్దారి   చైతన్య యూత్,  రెడ్ క్రాస్ సంస్థ తణుకు శాఖ సహకారంతో రక్తదాన  శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన   సర్పంచ్  చీపుళ్ళ కుమారి  మాట్లాడుతూ  అంబేద్కర్ ఆశయాలకు  అనుగుణంగా నడిచే యువత, గ్రామ పెద్దలు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బి లక్ష్మీకాంతం తో పాటు ఇరువురు మహిళలు, ఉండ్రాజవరం కానిస్టేబుల్  వి ఎస్ కే త్రినాధ్, 18 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమిటీ ఆర్గనైజర్ అమిరపు లక్ష్మణరావు ఆధ్వర్యంలో రక్తదాత లకు రెడ్ క్రాస్ సంస్థ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్రీను, చీపుళ్ళ‌ అశోక్,  రెడ్ క్రాస్ ఇంచార్జ్ సూర్య, టెక్నీషియన్ పవన్   తదితరులు పాల్గొన్నారు.

➡️