తలసేమియా ఆస్పత్రి ఏర్పాటు

Nov 5,2024 21:51
ఫొటో : దాతను సన్మానిస్తున్న ఆర్‌డిఒ వంశీకృష్ణ

ఫొటో : దాతను సన్మానిస్తున్న ఆర్‌డిఒ వంశీకృష్ణ

తలసేమియా ఆస్పత్రి ఏర్పాటు

ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో తలసేమియా ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు, తలసేమియా బాధిత బాలలకు ఒక వరం అని ఆర్‌డిఒ వంశీకృష్ణ పేర్కొన్నారు. కావలి రెడ్‌క్రాస్‌ ఆవరణలో త్వరలో ప్రారంభించునున్న తలసేమియా ఆసుపత్రి నిర్వహణ కొరకు పట్టణ ప్రముఖులు విరాళాలు అందజేయగా, కావలి ఆర్‌డిఒ, రెడ్‌క్రాస్‌ అధ్యక్షులు వంశీకృష్ణ రెడ్‌క్రాస్‌ భవనంలో ఆ విరాళాలు స్వీకరించారు. విశ్రాంత బ్యాంక్‌ అధికారి, రెడ్‌క్రాస్‌ యోగ కేంద్రం కన్వీనర్‌ కె.హరినారప రెడ్డి ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు, ప్రముఖ బిల్డర్‌ దేవరపల్లి మధుసూదన్‌ రెడ్డి ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను ఆర్‌డిఒ వంశీకృష్ణకు అందజేయగా, ఆర్‌డిఒ వారిని అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పెద్ద నగరాలలో మాత్రమే సాధ్యమయ్యే తలసేమియా వైద్యసేవలు కావలి లాంటి చిన్న పట్టణంలో దాతల సహాయంతో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత తలసేమియా బాధిత బాలలకు ఒక వరమని పేర్కొన్నారు. మరో పది రోజుల్లో తలసేమియా డే కేర్‌ సెంటర్‌ ప్రారంభిస్తామని తెలిపారు. తలసేమియా ఆసుపత్రి నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి రెడ్‌క్రాస్‌కు సహకరించాలని ఆర్‌డిఒ కోరారు. రెడ్‌ క్రాస్‌ రక్తకేంద్ర ఆధునీకరణ, తలసేమియా ఆసుపత్రి నిర్మాణం కోసం విశేష కృషి చేసి విరాళాలు సేకరించిన కావలి రెడ్‌క్రాస్‌ కోశాధికారి కలికి శ్రీహరిరెడ్డిని ఆర్‌డిఒ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రం కన్వీనర్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, చైర్మన్‌ డి.రవిప్రకాష్‌, ప్రముఖ రొటేరియన్‌ వెంకట సుబ్బయ్య, రక్తకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

➡️