ప్రతి విద్యార్థికి స్టూడెంట్‌ కిట్‌ అందాలి : డిఇఒ

ప్రజాశక్తి-చీమకుర్తి : ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి స్టూడెంట్‌ కిట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర పేర్కొన్నారు. ఎంఇఒ-2 శివాజీతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎంఆర్‌సి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది నుంచి అమలయ్యే సిబిఎస్‌సి సిలబస్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి విద్యార్థులకు వివరించారు.10వ తరగతి విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్‌లు అందరికి అందాయా? లేదా అని వాకబు చేశారు.పాఠశాల పరిపాలనా వ్యవహాలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యంకు సూచించారు.అనంతరం ఎంఆర్‌సికి వెళ్లి సిబ్బంది హాజరు నమోదు పరిశీలించారు. అనంతరం జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అక్కడ చేపట్టిన నాడు-నేడు పనులపై ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్‌ అధికారితో సమీక్షించారు. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని,స్టాప్‌ డెంగ్యూ,స్టాప్‌ డయోరియాపై అవగాహనా కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ-2 కె. శివాజీ, ప్రధానో పాధ్యాయులు వీరాస్వామి, సుబ్రహ్మణ్యం,ఉపాధ్యాయులు, ఎంఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు.

➡️