ప్రజాశక్తి-తాళ్ళూరు: కూటమి ప్రభుత్వంలోని ప్రజలందరికీ మేలు జరుగుతుందని, అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. సోమవారం రాత్రి గుంటిగంగమ్మ తిరునాళ్లలో తురకపాలెం తెలుగు యువత మరియు నాగంబోట్లపాలెం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ప్రభలపై కడియాల లలిత సాగర్‌తో కలిసి ప్రసంగించారు. ఈ సందర్భంగా గుంటిగంగమ్మ కరుణ కటాక్షాలు అందరికీ ఉండి సుభక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు కూటమి ప్రభుత్వంలో మంచి పాలన అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిందన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు గొట్టిపాటి లక్ష్మిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పాటకచేరీలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల సీనియర్ నాయకులు తురకపాలెం సర్పంచి చంద్రగిరి గురవారెడ్డి, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
