ప్రతిఒక్కరూ హెల్మెట్‌ ధరించాలి

Jan 24,2025 22:19
ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు
ప్రతిఒక్కరూ హెల్మెట్‌ ధరించాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : రోడ్డు భద్రత నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని, బైక్‌పై డ్రైవింగ్‌ చేసే వారు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని ఉదయగిరి సిఐ వెంకట్రావు, వరికుంటపాడు ఎస్‌ఐ ఎం.రఘునాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా ద్విచక్ర వాహనదారులతో కలిసి మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామం నుంచి తోటలచెరువు పల్లి వరకు బైక్‌పై హెల్మెట్‌ను ధరించి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని, రోడ్డు భద్రత నియమావళిని పాటించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌ లేకుండా బైక్‌పై డ్రైవ్‌ చేయడం, మైనర్‌ డ్రైవింగ్‌ చట్టరీత్య నేరమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️