రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరూ వినియోగించుకోవాలి

Nov 26,2024 18:18 #anatapuram

ప్రజాశక్తి – కోటనందూరు : మంగళవారం నాడు తునిలో శ్రీ ప్రకాష్ విద్యార్థుల కు రాజ్యాంగ దినోత్సవ అవగాహాన సదస్సు లో అడ్వకేట్ జి.పి. మధురా గ్రేస్ రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకోవాలని అడ్వకేట్ జి.పి.మధురా గ్రేస్ స్పేసెస్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ అవగాహాన సదస్సు లో తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం ఉద్దేశ్యంతో రూపొందించబడిన రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటారని విద్యార్థులకు తెలియచేసారు. దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం సౌబ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎ. రామకృష్ణారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️