భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆచరించాలి

Nov 26,2024 18:42 #Konaseema

ప్రజాశక్తి  – కపిలేశ్వరపురం : భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆచరించాలని ఎంపీడీవో కె. రత్నకుమారి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణ లో భారత రాజ్యాంగ 75వ దినోత్సవ వేడుకను ఎంపీడీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.అనంతరం అంగర జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఎఒ జి రాజేంద్రప్రసాద్ ,విస్తరణాధికారి ఆర్ ఎం వి వి ఎన్ ఈశ్వరరావు, కార్యదర్శులు ,వి ఆర్ ఓ లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

➡️