ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో ఎస్‌ ఎస్‌ శర్మ

Apr 16,2024 15:45 #tadepalligudem

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం:ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు శాతం పెంచాలని తాడేపల్లిగూడెం ఎలక్షన్‌ నోడల్‌ అధికారి , ఎంపీడీవో ఎస్‌ ఎస్‌ శర్మ అన్నారు. మంగళవారం శశి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎన్‌.యస్‌.యస్‌., ఎన్‌.సి.సి., ఏ.సీ.యం, ఎలెక్టోరల్‌ క్లబ్‌ విద్యార్థులు తాడేపల్లిగూడెం పట్టణంలో ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలెక్షన్‌ నోడల్‌ అధికారి ,డిఓ యస్‌.యస్‌.శర్మ పాల్గని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు శాతం పెంచాలని అన్నారు. కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్‌ డా.ఎం. నాగేంద్రనాథ్‌ మాట్లాడుతూ తమ కళాశాల ద్వారా సామాజిక బాధ్యతగా ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవ హారం నిర్వహించి ఓటరు అవగాహన నినాదం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్డినేటర్లు షేక్‌ సల్మాన్‌ బాషా, డా. పి.శివకుమార్‌, పి. శేఖర్‌ అధ్యాపకులు పాల్గన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న విద్యార్థులను కళాశాల వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్ర కఅష్ణ, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌, డీన్‌ డా. సత్యనారాయణ తదితరులు అభినందించారు.

➡️