ప్రజాశక్తి – కడప : పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యంగా భావించి కష్టించి పని చేయాలని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాజీ కడప ఎమ్మెల్యే ఎస్. బి.అంజాద్ భాష పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నివాస కార్యాలయంలో నూతనంగా నియమితులైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, చాన్ భాష, జిల్లా సెక్రెటరీ టకోలి రమేష్ రెడ్డి, మునిశేఖర్ రెడ్డి లను కడప నియోజకవర్గం వారిని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అంజాద్ భాషను కూడా ఈ సందర్భంగా వారు శాలవాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ టిటిడి బోర్డు నెంబర్ యానాదయ్య,కార్పొరేటర్లు మొహమ్మద్ షఫీ, ఎస్.అజ్మతుల్లా ఖాన్, నాయకులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, రహీం పాల్గొన్నారు.