భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూంకు ఈవిఎంలు

May 14,2024 12:50 #EVM, #strong rooms

తిరుపతి : తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్ట్రాంగ్‌ రూంకు 7 అసెంబ్లీ నియోజక వర్గాల, 23- తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన పోల్డ్‌ ఈవీఎం లు చేరుకుంటున్నాయి. అత్యంత భద్రత నడుమ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌, తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల సమక్షంలో ఈవిఎంలను భద్రపరచడం కొనసాగుతోంది.

➡️