చీరాల విద్యార్థి హత్య – నిందితులను శిక్షించాలి : మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : విద్యార్థి హత్య కేసును పోలీసులు త్వరగా ఛేదించి నిందితులను కఠినంగా శిక్షించాలని చీరాల గడియారం స్థంభం సెంటర్లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ డిమాండ్‌ చేశారు. చీరాల మండలం ఈపురిపాలెం గ్రామం యూసుఫ్‌ నగర్‌ చెందిన సయ్యద్‌ అమర్‌ ఆరిఫ్‌ మంగళవారం రాత్రి ఆదినారాయణపురంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పరామర్శించారు. బుధవారం స్థానిక చీరాల ఏరియా వైద్యశాలకు చేరుకున్న విద్యార్థి మఅతదేహాన్ని పరిశీలించారు. యూసుఫ్‌ నగర్‌ చెందిన సయ్యద్‌ అమర్‌ ఆరిఫ్‌ హత్య గురించి టూ టౌన్‌ సీఐ సోమశేఖర్‌ తో జరిగిన విషయంపై ఆరా తీసి దోషులను వెంటనే అరెస్ట్‌ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో శాంతి భద్రతులను పర్యవేక్షించాలన్నారు. ఇలాంటివి ఘటనలను పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు.

➡️