ప్రజాశక్తి – గరుగుబిల్లి (మన్యం) : మండల పరిధిలో రావుపల్లి లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ ను జనసేన పార్టీ మండల అధ్యక్షులు బోను శివ శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి పరీక్షలు మంచిగా వ్రాయాలని, మంచి మార్కులు సాధించాలని, తల్లి తండ్రులుకి, ఉపాధ్యాయులకు , స్కూల్ కి మరియు గ్రామానకి మంచి పేరు తీసుకురావాలినీ పరీక్ష సమయంలో ఎలాంటి వత్తిడి కి లోను కాకుండా ప్రశాంతం ఆలోచన తో పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. అలాగే భవిష్యత్తు లో ఉన్నత చదువులు చదవాలంటే పదివ తరగతి పరీక్ష లలో మంచి ఫలితాలు సాధించాలని ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, జనసేన కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
