ప్రజాశక్తి -మండపేట : విద్యార్థులంతా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలకు హాజరై మంచి ఫలితాలను సాధించి, పాఠశాల కు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వెలగతోడు గ్రామ సర్పంచ్ నలమామిడి కృప రాజు, గ్రామ పెద్దలు ఈదల వీరాస్వామి అన్నారు. వెలగతోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి విద్యార్థులకు విద్యాదాత ఈదల వీరాస్వామి గురువారం పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రెడ్డి సురేష్, వైస్ చైర్మన్ పిల్లిల్లి మమత, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, వీరభద్రరావు, అలీ, శ్రీనివాస్, సఫీర్, ఏసు రాజు, సాయి పాల్గొన్నారు.
