పారాది వంతెన పనులు పరిశీలన

Apr 11,2025 21:09

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : మండలంలోని పారాది వద్ద వేగావతి నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణంతో తమ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. తమ తాత శ్వేతచలపతి రామకృష్ణ రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన వంతెన ఇప్పటివరకు ఎంతో దృఢంగా ఉందన్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా ఇప్పుడు బలహీన పడిందన్నారు. ఇప్పటివరకు ఉన్న వంతెన తమ తాత నిర్మిస్తే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన తన సోదరుడు సుజరుకృష్ణ రంగారావు మంజూరు చేయించగా, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూపుదాల్చడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో నాణ్యత పరంగా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అధికారులు చెబుతున్నట్లు కంగారుగా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో కాకుండా, పూర్తి నాణ్యతతో నిర్మాణ పనులు చేసి నవంబర్‌ నాటికి వంతెన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రతినిధి ఎ.భాస్కరరావు, కాంట్రాక్టర్‌ పానకాలరావు, ఆర్‌అండ్‌బి ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️