అపోలో వైద్యునికి ఎక్సలెన్స్‌ అవార్డు

అపోలో వైద్యునికి ఎక్సలెన్స్‌ అవార్డు

ప్రజాశక్తి – ఆరిలోవ : సీనియర్‌ ఆర్థో పెడిక్‌ కన్సల్టెంట్‌, ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఒడి అపోలో వైద్యులు డాక్టర్‌ అబ్దుల్‌ ఢ ఖాన్‌కు సిల్వర్‌ జూబ్లీ ఎక్సలెన్స్‌ అవార్డు వరించింది. విశాఖ నగరంలో ఇటీవల నిర్వహించిన ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఒస్సప్‌) వార్షిక సదస్సులో ఈ అవార్డును. కోయంబత్తూర గంగా ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ నుంచి అందుకున్నారు. ఈ ఏడాది సదస్సులో ఉత్తమ ఒరిజనల్‌ రీసెర్చ్‌ పేపర్‌ను సమర్పించినందుకు ఈ అవార్డు లభించింది. డాక్టర్‌ అబ్దుల్‌ ఖాన్‌ ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబిబిఎస్‌ పూర్తి చేసారు. అనంతరం యు.కెలో గల లివర్‌ పూల్‌లో ఉన్నత ఆర్థో పెడిక్‌ శిక్షణ , మరిన్ని డిగ్రీలు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో 80కి పైగా మౌఖిక, ఇ-పోస్టర్‌ ప్రదర్శనలను ఇచ్చారు.

సిల్వర్‌ జూబ్లీ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకుంటున్న డాక్టర్‌ అబ్దుల్‌ డి ఖాన్‌

➡️