గీత కార్మికుల మందు షాపులకు టెండర్ల గడువు పొడిగింపు : ఎక్సైజ్‌ సిఐ నాగేశ్వరరావు

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : గీత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక మందు షాపుల టెండర్ల ప్రక్రియ గడువు ఈనెల 8న సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ ఎక్సైజ్‌ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో ఎక్సైజ్‌ సీఐ ఐ.డి.నాగేశ్వరరావు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఈనెల 5 వరకు టెండర్లకు గడువు ఇచ్చారన్నారు. మరల దానిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు ఎవరైనా తమ వివరాలతో కార్యాలయంలో సంప్రదించుకొని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈనెల 9న అందిన టెండర్లన్నిటిని పరిశీలించి, అర్హులను గుర్తించి జాబితా తయారు చేసి, 10న ఉదయం 9 గంటలకు వారందరికీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డ్రా తీసి, విజేతలను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్సై రాంబాబు, సిబ్బంది ఉన్నారు.

➡️