ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మద్యం షాపుల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 11 వరకు పొడిగించినట్లు ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.డి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈనెల 9 తో దరఖాస్తులకు గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువును ఈ నెల 11 సాయంత్రం 7 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు నాగేశ్వరరావు వివరించారు. ఇప్పటివరకు ఆలమూరు సర్కిల్ పరిధిలోని 20 షాపులకు 231 దరఖాస్తులు అందాయని ఆయన చెప్పారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 14న డ్రా ద్వారా షాపులు కేటాయింపు జరుగుతుందన్నారు. ఆసక్తి కలవారు త్వరగా తమ దరఖాస్తులను పూర్తి చేసి అందజేయాలని కోరారు.
