విశాఖ : ధాన్ ఫౌండేషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవాన్ని స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో బుధవారం అత్యంత ఉత్సాహపూరితంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి కావడంతో, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విఎంఆర్‌డిఎ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్ చేతులమీదుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మహాత్మాగాంధీ జయంతి రోజే ధాన్ ఫౌండేషన్ డే కావడం విశేషం అన్నారు.. ఆయన ఆశయాలతో మీరంతా నడుస్తూ పేదరిక నిర్మూలన కోసం కలిసికట్టుగా పనిచెయ్యడం చాలా ఆనందం కలిగిస్తుందని అన్నారు. అలాగే దాన్ ఫౌండేషన్ లక్ష్యాలలో, అభివఅద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మరో ముఖ్య అతిథి బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజడ్‌ఎం ఎన్.సీతారాం మాట్లాడుతూ … అన్ని సమాఖ్యల నుండి వచ్చిన నాయకులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు. ముందుగా ధాన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిమలై ఆన్ లైన్ ద్వారా ఇచ్చిన సందేశం సభికులకు స్ఫూర్తినిచ్చింది. అనంతరం వైజాగ్ రీజనల్లో సాధించిన ప్రగతిని పేదరిక నిర్మూలన దిశగా గత 25 సంవత్సరాలుగా నగరంలో 2300 గ్రూపుల ద్వారా 33 వేల కుటుంబాలతో పని చేస్తున్న తీరుని, ఫౌండేషన్ వైజాగ్ కో – ఆర్డినేటర్ శ్రీమతి శైలజ వివరించారు. సభ్యులందరి మొత్తం పొదుపులు 120కోట్లు కాగా 210 కోట్లు మిగిలి ఉన్న అప్పులు ఉన్నాయన్నారు. కేవలం ఆర్థిక విషయాలు మాత్రమే కాకుండా, భీమా, ఆరోగ్య కార్యక్రమాలు, జీవనోపాధి కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు ద్వారా కూడా ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఈ 25 సంవత్సరాల్లో నగరంలో 2129 కళంజియ కుటుంబాలు పేదరికాన్ని జయించాయని ప్రకటించారు, ఇది మనందరం కలిసికట్టుగా సాధించిన ప్రగతి అని తెలియజేశారు. అనంతరం మల్కాపురం కళంజియ సమాఖ్యలో పేదరికాన్ని జయించిన కళంజియ మహిళల విజయ గాథలు పుస్తకాన్ని కమిషనర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. అలాగే పేదరికం నుండి బయటపడ్డ 5గురు మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడింగ్టన్ ఫౌండేషన్ నుండి విచ్చేసిన అతిథులు ధాన్ ఫౌండేషన్- రెడింగ్టన్ కలిసి చేస్తున్న క్యూర్ తీరప్రాంత అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా క్యూర్ ప్రతినిధి శ్రీ లోకేష్, తీరప్రాంత ధాన్ కో.ఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి, రూరల్ రీజియన్ ఆర్డినేటర్ శ్రీ రాంకుమార్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ డిపార్ట్మెంట్ జే.డి గారు, జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ అప్పలనాయుడు పాల్గొని ప్రసంగించారు. చిన్నారులు తమ నఅత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో దాన్ ఫౌండేషన్ వైజాగ్ రీజియన్ నాయకులు, పూర్వ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.