ప్రజాశక్తి-మేదరమెట్ల : రావినూతలతో నిర్వహిస్తున్న సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం డిజిసిఎ గుంటూరు జట్టు, మస్తాన్ 11 మార్టూరు జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచిన మార్టూరు జట్టు తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 116 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జిడిసిఎ గుంటూరు జట్టు 18.2 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధిం చింది. ఈ జట్టులోని మహిప్ కుమార్ టోర్నమెంట్‌లోని తొలి అర్థ సెంచరీని నమోదు చేశారు. 47 బాల్స్లు ఆడి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ 53 పరుగులు చేశారు. ఇదే జట్టుకు యాదవ్ బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తీశాడు. మధ్యాహ్నం మ్యాచ్‌లో ఎంఆర్సిసి చెన్నై, ఎంఐఎస్ రాఖీస్ చెన్నై జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎంఆర్సిసి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 154 పరుగులను చేసింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐఎస్ రాఖీ చెన్నై జట్టు కేవలం 14.1 ఓవర్లలో 72 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది గుంటూరు, చెన్నై జట్లు సెమీస్‌కు చేరాయి. నేటి మ్యాచ్‌లు ఇవే…శనివారం ఉదయం ఇండియన్ బ్యాంక్ ఎస్ఆర్సి చెన్నై వర్సెస్ థండర్ బోర్డ్స్ 11 తిరుపతి జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వర్సెస్ ఎస్‌కెఎం సిసి లెవెన్ చెన్నై జట్లు తలపడనున్నాయి.