ఇళ్ల స్థలాల రద్దుకు కసరత్తు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి కడప జిల్లాలో ఇళ్ల స్థలాల రద్దు కసరత్తు ఊపందుకుంది. ఇటీవల ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వ హించిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర వ్యా ప్తంగా హౌసింగ్‌ నిర్మాణాలు చేపట్టని లబ్ధి దారుల ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసిం ది. జిల్లా రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు సం యుక్తంగా కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇళ్ల నిర్మా ణాలు చేపట్టని లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు.కడప జిల్లాలో 96,335 పక్కా గృహాలు, అన్నమయ్య జిల్లాలో 79,721 లబ్ధి దారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కడపలో 83, 491 ఇళ్లు, అన్నమయ్యలో 79,721 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కడప జిల్లాలోని మైదుకూరు, కమలాపురం డివిజన్లలో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిప ిస్తోంది. కడప, పులివెందుల, ప్రొద్దు టూరు డివిజన్లలో ఆశించిన పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది. 2024 డిసెంబర్‌ నాటికి 36,371 వేల ఇళ్లు పూర్తయ్యాయి. ఈలెక్కన 37.75 శాతం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం గమ నార్హం. కూటమి సర్కా రు హౌసింగ్‌శాఖపై దృష్టి సారిం చింది. ఐదేళ్లుగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టని లబ్ధిదారుల డేటాను సేక రిం చింది. ఇళ్లు అవసరం లేని వారి స్థలా లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణ యం తీసుకుంది. ఇళ్లు లేని లబ్ధి దారులకు ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది.పారదర్శక సర్వేకు ఆదేశాలుఉమ్మడి జిల్లాలోని సొంత స్థలాలు, రెవెన్యూ స్థలాలు పొందిన లబ్ధిదారులను గు ర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధి దారులు, సొంత స్థలాల్లో ఎందరు, రెవెన్యూ స్థలాలకు చెందిన లబ్ధిదారులు ఎందరున్నారో గుర్తించాలని ఆదేశించింది. మూడు కేటగిరీల్లో హౌసింగ్‌ పనులు చేపడతామని ముందుకు వచ్చిన లబ్ధిదారులను మినహాయించనున్నట్లు తెలుస్తోంది.నెల రోజుల్లో సర్వే నివేదికఉమ్మడి జిల్లా పరిధిలో హౌసింగ్‌ పను లు చేపట్టని లబ్ధిదారుల వివరాలకు సర్వేకు శ్రీ కారం చుట్టింది. నెల రోజుల వ్యవధిలో సర్వే నివేది కను అందజేయాలని ఆదేశించింది. హౌసింగ్‌, రెవె న్యూ యంత్రాంగాలు సంయుక్తంగా మండల సా ్థయిలో హౌసింగ్‌ ఎఇ, తహశీల్దార్‌, ఆర్‌ఐ, విఆర ్‌ఒ, సచివాలయ కార్యదర్శులతో కూడిన బృందాలు సర్వే ప్రక్రియకు ఉపక్రమించాయి. కడప, అన్న మయ్య జిల్లా హౌసింగ్‌ శాఖలు ఐదేళ్లుగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల వివరాలను అందజేసిన సంగతి తెలిసిందే.16,091 స్థలాలు గల్లంతు?కడప, అన్నమయ్య జిల్లాల్లో 16,091 ఇళ్లస్థలాలపైగా గల్లంతు కానున్నట్లు తెలుస్తోంది. పారదర్శక సర్వే అనంతరం ఇళ్లస్థలాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిలా ్లలో 12, 844 మంది హౌసింగ్‌ లబ్ధిదారులు, అన్న మయ్య జిల్లాలో 3,247 మంది లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు వెరసి 16,091 మంది ఇళ్లస్థలాల వివ రాలను అందజేసిన సంగతి తెలిసిందే. హౌసింగ్‌, రెవెన్యూ బృందాల పారదర్శక సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

➡️