ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు శుద్ధజలాన్ని అందించేందుకు వాట ర్‌గ్రిడ్ (మల్లీ విలేజ్ స్కీమ్) ఏర్పాటుకు కసరత్తు ఊపందుకుంది. జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.1500 కోట్ల వ్యయంతో ఐదు రిజర్వాయర్ల నుంచి 1,540 హ్యాబిటేషన్లకు తాగునీటిని అందించడానికి ఉద్దేశించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలోని బ్రహ్మసాగర్, మైలవరం, గండికోట, తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎస్‌ఆర్-1, సోమశిల రిజర్వాయర్ల పరిధిలోని 134 టిఎంసిల నుంచి తాగునీటి సరఫరా చేయడానికి ఉద్దేశించి మల్లీ విలేజ్ స్కీమ్‌నకు రూపకల్పన చేసింది. రూ.470 కోట్లతో బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల పరిధిలోని కాశినాయన, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.మఠం, మైదుకూరు, ఖాజీపేట మండలాల పరిధిలోని 617 హ్యాబిటేషన్లకు చెందిన 2,99,999 మందికి 0.29 టిఎంసిల మేర సరఫరా చేయనున్నట్లు పేర్కొంటోంది. రూ. 280 కోట్లతో మైలవరం రిజర్వాయర్ నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల పరిధిలోని పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల పరిధిలోని 157 హ్యాబిటేషన్లకు చెందిన 1,98,777 మందికి 0.17 టిఎంసిల మేరకు సరఫరా చేయనుంది. రూ.490 కోట్లతో గండికోట రిజర్వాయర్ నుంచి జమ్మలమడుగు, కమలాపురం నియో జకవర్గాల పరిధిలోని కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, వి.ఎన్‌పల్లి, పెండ్లి మర్రి, వల్లూరు, సికెదిన్నె, చెన్నూరు, కమలాపురం మండలాల పరిధిలోని 479 హ్యాబిటేషన్లకు చెందిన 2,99,826 మందికి 0.30 టిఎంసిల మేరకు తాగుఙb నీటిని సరఫరా చేయనుంది. తెలుగుగంగలోని ఎస్‌ఆర్-1 జలాశయం నుంచి రూ.140 కోట్లతో దువ్వూరు, చాపాడు మండలాలకు చెందిన 104 హ్యాబిటేషన్ల పరిధిలోని 93,174 మందికి తాగునీటిని సరఫరా చేయనుంది. రూ.120 కోట్లతో సోమశిల రిజర్వాయర్ నుంచి బద్వేల్, రాజంపేట నియోజక వర్గాలకు చెందిన గోపవరం, బద్వేల్, అట్లూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు చెం దిన 66,955 మందికి శుద్ధజలాన్ని అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిం ది.పులివెందుల వాటర్‌గ్రిడ్ మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 28 మండలాలకు చెందిన 1540 హ్యాబిటేషన్లకు పరిధిలోని 9,58,731 మందికి రూ.1500 కోట్ల వ్యయంతో తాగునీటిని అందించడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలోని ఐదు ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిల్వలైన 134 టిఎంసిల నిల్వల నుంచి శుద్ధజలాన్ని అందించనుంది. వేసవి సీజన్‌లో 9.55 టిఎంసిల మేరకు డెడ్‌స్టోరేజీ పడిపోయినప్పటికీ 0.94 53 టిఎంసిల మేరకు తాగునీటిని సరఫరా చేయడానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా తాగునీటి సరఫరా వ్యవస్థ విభాగం ఇంజినీరింగ్ నిపు ణులు సర్వేలు చేయడంపై దృష్టి సారించింది. సర్వే అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.్త