ప్రజాశక్తి -అనంతపురం క్రైం : డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా అనంతపురంలో పోలీసులు రైళ్లలో తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ పసిగట్టడంలో సుశిక్షణ పొందిన షైనీ జాగిలం ద్వారా జిల్లా కేంద్రం గుండా వెళ్లే రైళ్లలో స్థానిక త్రీటౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఎస్ఐ గో ఉన్నపాలుడు ఆధ్వర్యంలో త్రీటౌన్ పోలీసు సిబ్బంది మరియు బాంబు డిస్పోజబుల్ బృందం, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ఒడిశాలోని భువనేశ్వర్ నుండీ బెంగుళూరుకు అనంతపురం మీదుగా వెళ్లే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సాధారణ ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఈ తనిఖీలు కొనసాగాయి. గంజాయి, అక్రమ మద్యం రవాణా జరుగకుండా లోతుగా చెక్ చేశారు. అనుమానాస్పదులు, వారి లగేజీలను షైనీ జాగిలం ద్వారా తనిఖీ చేశారు.