పనుల వద్ద సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు

Apr 15,2025 17:53 #nandhyala

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : ప్రభుత్వం ఉపాధి పనుల వద్ద సౌకర్యాలు కల్పించి వడదెబ్బ నుండి కూలీలను కాపాడాలని ప్రభుత్వం చెప్పుతున్నా పనుల వద్ద సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు అల్లాడుతున్నారనిఅధికారులు మాత్రం స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి, అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎం నరసింహ నాయక్ లు ఆరోపించారు. ఎండను సైతం లెక్క చేయక వారం రోజులు పని చేసిన కూలీలకు బిల్లులు రావడం లేదని వారు ఆవేదన చెందారు. ఉపాధి పనుల వద్ద చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు 12 వారాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరు చేయాలని జిల్లాలో ఉపాధి కూలీలందరికీ పనులు కల్పించాలని పని ప్రదేశాలలో నీడ మెడికల్ కిట్లు సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.శివ నాగరాణి, జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎం నరసింహ నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ బడ్జెట్లో నిధులు తగ్గించారని ఉపాధి కూలీలకు జిల్లా వ్యాప్తంగా 12 వారాలు వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారం వారం క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని పని ప్రదేశాలలో మెడికల్ చెట్లు నీడ వసతి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్న అధికారులు మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకుల పెత్తనం పెరిగిందని ఉపాధి కూలీలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్న మేట్లను తొలగించి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారినే ఏపీవోలు మెట్లుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని గ్రామాలలో ఉపాధి కూలీలు పనులు అడుగుతున్న అధికారులు పనులు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రమాదాలకు గురైనటువంటి ఉపాధి కూలీలకు ఎలాంటి మెడికల్ ఖర్చులు చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వెడ్డింగ్ లో ఉన్న ఉపాధి వేతనాలను వెంటనే చెల్లించాలని పని ప్రదేశాలలో నీడ మెడికల్ కిట్లు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఉపాధి కూలీలకు వారం వారం బిల్లులు సక్రమంగా చెల్లించాలని రోజు వేతనం 600 రూపాయలకు పెంచి 200 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు సంఘీభావం తెలిపారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని, వేసవిలో కూలీలు ఇతర రాష్టాలకు జిల్లాలకు వలసలు వెళ్లకుండా స్థానికంగా పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, ఎస్ బాలయ్య, ఈశ్వరమ్మ, ఫకీర్ సాహెబ్రా, ములమ్మ, కృష్ణ వెంకటేశ్వర్లు, కోటకొండ భాష మద్దిలేటి కరీం వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

➡️