ప్రజాశక్తి – కడప అర్బన్ కార్మికులు, ఉద్యోగులు, కర్షకులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే పతనం తప్పదని ఆల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక, రైతు సంఘాలు మంగళవారం కడప కళాక్షేత్రం నుంచి ఒకటో గాంధీ విగ్రహం, మద్రాస్ రోడ్డు,పొట్టి శ్రీరాములు విగ్రహం, ఏడు రోడ్ల వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఏడు రోడ్ల కూడలి వద్ద కార్మికుల సంఘాల నాయకులు తమ ఐక్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శులు ( సిపిఐ, సిపిఎం)భాస్కర్, దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీదేవి ప్రసంగించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50శాతం అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని రూ.26వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్డ్ అయిన వారికి రూ.10 వేలు కనీస పెన్షన్ చెల్లించాలని పేర్కొన్నారు. ఆటో, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని తెలిపారు. స్కీం వర్కర్లయిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, కార్మికులను రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. గ్రా డ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిం చాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. ప్రజలపై విద్యుత్ భారాలు పెంచే 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, అత్యవసర మందులపై జిఎస్‌టి ఎత్తివేయాలని చెప్పారు. ధరలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు పటిని తగ్గ వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేయాలని కోరారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం నిలుపుదల చేయాలని తెలిపారు. ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం రూ.600 చెల్లించాలని, పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని పేర్కొన్నారు. మూసివేసిన చక్కెర, పాల పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లు అందరిని కొనసాగించి, పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, మున్సి పల్ యూనియన్ నాయకులు రవి, ఆనందరావు, కిరణ్, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. సుహాసిని, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జి. వేణుగోపాల్,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కె.సి.బాదుల్లా, నగర కార్యదర్శి మద్దిలేటి, జిల్లా ఉపాధ్యక్షులు మంజుల, చాంద్ బాషా జిల్లా కార్యదర్శి శ్రీరాములు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శాంతమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు కామాక్షమ్మ, మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు తారక రామారావు, నరసింహ, రవి పాల్గొన్నారు.కార్మిక, కర్షక ఆందోళనలకు ఎల్‌ఐసి యూనియన్ సంఘీభావం కర్షకులకు 150 శాతం కనీస మద్దతు ధర, కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం, రూ. 10వేల కనీస పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు విరమించాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాధ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం డివిజనల్ కార్యాల యం ఎదుట ‘కార్మిక, కర్షక దేశవ్యాప్త నిరసన దినానికి మద్దతుగా’ యూని యన్ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో ఉద్యోగుల సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ సంద ర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమం విరమించుకున్నారని, ఇప్పుడైనా 150 శాతం మేర చట్ట బద్ధమైన కనీస మద్దతు ధర చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టా లన్నారు. బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డిఐ ఆలోచన విరమించాలన్నారు. ఎల్‌ఐసి లోను, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానానికి నిర్ణయం తీసుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. బీమా రంగంలో పెన్షన్ అప్డేషన్ చేయాలన్నారు. రైతు, కార్మిక సంఘాలతో చర్చించి వారి సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ ఐ సి యూనియన్ నేతలు అక్బర్, సుధీకర్, వారిజాతమ్మ, రాజు, అయ్యవారు రెడ్డి, పర్వీన్, వసుప్రద, కుమార్, లీలాలక్ష్మీ, పద్మజాలత, చిన్నయ్య, సాదక్ పాల్గొన్నారు.