ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : విజయనగరంలో శ్రీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ , వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), సతీమణి మజ్జి పుష్పాంజలి, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ ) శుక్రవారం శ్రీ జగన్నాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నా రు. ముందుగా ఆలయ నిర్వాహకులు, వేదపండితులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం ఫలికారు. జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం పొందారు.