‘సెయింట్‌ఆన్స్‌’లో వీడ్కోలు వేడుకలు

ప్రజాశక్తి-వేటపాలెం : స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలో బిటెక్‌ మెకానికల్‌ ఇంజినీ రింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం మూడో సంవత్సరం విద్యార్ధులు గురువారం వీడ్కోలు సభ నిర్వహిం చినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకష్ణారావు కరస్పాండెంట్‌ యస్‌. లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ కె. జగదీశ్‌ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై దష్టి సారించాలన్నారు. వాటిపై ప్రత్యేక శిక్షణను పొందితే అధిక వేతనముతో కూడిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి లక్షీతులసి చావలి మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంపొందించు కోవలన్నారు. వాటిపై పరిశోధన గావించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ మూడవ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ సందేశాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రకమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమములో సియస్‌ రావు, ఆర్‌వి.రమణ మూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనానరు.

➡️