సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రేణిగుంట విమానాశ్రయం వద్ద సాదర వీడ్కోలు

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డా.ధనంజయ వై. చంద్రచూడ్‌ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమైన భారత సిజెఐ కి సాదర వీడ్కోలు లభించింది. జస్టిస్‌ పి.కఅష్ణమోహన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జ్‌ ఆఫ్‌ చిత్తూరు జిల్లా, జస్టిస్‌ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఏపీ హైకోర్టు, జస్టిస్‌ రాఘవ స్వామి రిజిస్ట్రార్‌ ప్రోటోకాల్‌ హైకోర్టు ఆఫ్‌ ఏపీ, జస్టిస్‌ రామకృష్ణ రిజిస్ట్రార్‌ మేనేజ్మెంట్‌ హై కోర్టు ఆఫ్‌ ఏపీ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్‌ ప్రిన్సిపల్‌ జడ్జి ఈ. భీమారావు, చీఫ్‌ ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ గురునాథ్‌, తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, పి కోటేశ్వరరావు ప్రోటోకాల్‌ మెజిస్ట్రేట్‌, ధనుంజయ నాయుడు ప్రోటోకాల్‌ సూపరింటెండెంట్‌ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

➡️