శేష జీవితం ఆనందంగా గడపండి.. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: అక్టోబర్ నెల పదవీ విరమణ పొందిన హెడ్‌కానిస్టెబుల్ అశోక్ కుమార్ , క్లాస్‌ఫోర్ ఉద్యోగి వెంకటమ్మకు జిల్లా ఎస్‌పి మణింకఠ చందోలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 43 సంవత్సరాల పాటు వారు అంకిత భావంతో అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. పోలీసు డిపార్టుమెంటులో పనిచేయడం సవాల్‌తో కూడుకొన్నదని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి పరిస్థితులను తట్టుకుని కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం మామూలు విషయం కాదన్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించి ఆనందంగా శేషజీవితాన్ని గడపాలని కోరుతున్నట్లు తెలిపారు.