ప్రజాశక్తి-బొబ్బిలి : మండలంలోని కొండదేవుపల్లి గ్రామానికి చెందిన రైతు రాగోలు కృష్ణ (55) విద్యుదా ఘాతంతో మృతి చెందాడు. పొలంలో వరి పంటను చూసేందుకు మంగళవారం ఐరన్ కస్తా బొరిగి భుజంపై పెట్టుకుని వెళ్తుండగా పొలంలో విద్యుత్ వైర్లు కిందకు వేలాడడంతో ఆ బొరిగికి వైర్లు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్దదిక్కు మరణించడంతో భార్య లక్ష్మి, పిల్లలు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు