కేంద్ర మంత్రి వద్దకు కోల్డ్‌స్టోరేజీ బాధిత రైతులు

Oct 4,2024 00:21

రైతుల సమక్షంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
కోల్డ్‌ స్టోరేజ్‌లో భద్రపరిచిన మిర్చి బస్తాలను దొంగతనంగా అమ్ముకోవడంపై పలువురు రైతులు గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు, ఆలూరు, నంద్యాల, బళ్లారి, మార్కాపురం, పల్నాడు ప్రాంతాలకు చెందిన మిర్చితులు గుంటూరులోని నల్లపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలోగల ఓ కోల్డ్‌ స్టోరేజ్‌లో కొన్నాళ్ల క్రితం భద్రపరుచుకున్నారు. స్టోరేజ్‌కు చెందిన యజమాని నకిలీ వ్యక్తుల పేర్లు, ఆధార్‌ కార్డులతో రైతుల పేరిట లోన్లు తీసుకోవడమే గాక, పంటనూ అమ్ముకున్నారని రైతులు వాపోయారు. దీనిపై కేసు నమోదైనా పట్టించుకోవడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ ఎస్‌పి సతీష్‌ కుమార్‌కు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అధికారులను పిలిపించి వివరాలు సేకరించారు. రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

➡️