ప్రజాశక్తి-రాయచోటి కూటమి ప్రభుత్వానికి రైతుల ఆక్రమందన పట్టడం లేదని, రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటాం కొనసాగిస్తామని వైసిపి నాయకులు అన్నారు. శుక్రవారం రాయచోటిలో రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీ చేపట్టారు. ఈ సంద ర్భంగా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్ర బాబు చెప్పిన ష్యూరిటీ ఏమో గానీ ప్రజలపై బాదుడు మాత్రం గ్యారెంటీ అయిం దని ఎద్దేవా చేశారు. వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లా డుతూ రైతు గోడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలను ఇచ్చి, పబ్బం గడుపుకుని, ఇప్పుడు ప్రజలను నిలువునా ముంచే సిందన్నారు. తంబ ల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు అప్పుడు కానీ, ఇప్పుడు కానీ రైతు వ్యతిర్కేన్నారు. కరువు మండ లాలను ప్రకట నలతోనే సరిపెట్టారని, రైతులకు ఏమి మేలు చేయ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెట్టుచున్నారని తెలిపారు. చంద్ర బాబు ఇకనైనా రైతులపై దయచూపాలని, రైతులకు, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్నింట్లో విఫలమయిందని పేర్కొన్నారు. వైసిపి హయాంలో రైతులకు బాగా గౌరవం ఉండేదన్నారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆరు నెలల పాలనా కాలంలోనే ముఖ్య మంత్రి చంద్రబాబు విస్వాసం కోల్పోయారన్నారు. ఉచిత గ్యాస్ తుస్సు మందన్నారు. మహిళలకు ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణం హుళ్లక్కేనన్నారు. రైతు భరోసా కేంద్రాలను, గ్రామ సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, జడ్‌పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ సలహా అధ్యక్షుడు సుకుమార్‌రెడ్డి, మండల కన్వీనర్లు గడికోట జనార్దన్‌రెడ్డి, ఉదరు కుమార్‌రెడ్డి, యదుభూషన్‌రెడ్డి, జడ్‌పిటిసిలు మాసన వెంకటరమణ, వెంకటేశ్వరరెడ్డి, రత్నమ్మ, ఎంపిపిలు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, వీరబల్లె రాజేంద్రనాధరెడ్డి, మాజీ జడ్‌పిటిసి గొర్ల ఉపేంద్రారెడ్డి, మాజీ ఎంపిపిలు అంపాబత్తిన రెడ్డెయ్య, బండి చిన్నరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కర్ణపు విశ్వనాధరెడ్డి, కొలిమి హారూన్, ఆవుల నాగభూషన్‌రెడ్డి, జిల్లా వ్యాప్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన అనంతరం రైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు వినతిపత్రం సమర్పించారు.
