రైతులు మేలైన గడ్డి విత్తనాలు ఎంచుకోవాలి

ప్రజాశక్తి-దర్శి: రైతులు మేలైన గడ్డి విత్తనాలు ఎంచుకొని అధిక దిగుబడులు సాధించా లని తాళ్లూరు పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం తాళ్లూరు మండలం దారంవారి పాలెంలో దళిత బహుజన సెంటర్‌ కో-ఆర్డినేటర్‌ దార్ల కోటేశ్వరరావు అధ్యక్షతన రైతులకు గడ్డి విత్తనాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి గడ్డిలను ఎంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ రైతులకు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇచ్చే గడ్డి విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ బ్రహ్మయ్య, రైతులు పాల్గొన్నారు.

➡️