రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : ఎన్టీఆర్‌ జిల్లా, రెడ్డిగూడెం మండలం కేంద్రంలో ఆల్‌ ఇండియా రైతు సంఘం జెండావిష్కరణ కామ్రేడ్‌ ఉయ్యూరు కృష్ణారెడ్డి చే జరిగింది. దేశంలో రైతుల కోసం 90 క్రితం ఏర్పాటు అయిన ఆల్‌ ఇండియా రైతు సంఘం చరిత్ర ఎంతో ఘనమైనదని రైతు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం మాధవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … రైతే రాజు అన్న ఈ దేశంలో నేడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ వ్యతిరేక విధానాల చట్టాలను ఎదుర్కొవటంలో రైతు సంఘం విజయం సాధించిందనీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో రైతు సంఘం పాత్ర ఘనమైనదని తెలిపారు. అలాగే పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రైతు సంఘాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నేడు దేశ వ్యాప్తంగా రైతు సంఘం జెండావిష్కరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి,బాబు, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️