ఫాస్ట్ ట్రాక్ కోర్టు బదిలీని వెంటనే ఆపాలి : సిఎం చంద్రబాబుకి కడప బార్ అసోసియేషన్ సభ్యులు వినతి

ప్రజాశక్తి – కడప : ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 145 ను వెంటనే రద్దు చేయాలని కడప బార్ అసోసియేషన్ సిఎం చంద్రబాబుని కోరింది. ఈమేరకు మంగళవారం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప నాయుడు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ నంద్యాల చిన్నయ్య, ఉపాధ్యక్షులు చంద్రమోహన్, సీనియర్ న్యాయవాది పి. జయ రామిరెడ్డి జీవోను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. కేసుల విచారణలో జరిగే కాలం వల్ల కడప జిల్లా నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి సదరు కోర్టుకు హాజరయ్యేందుకు న్యాయవాదులు పక్షిదారులు, అధికారులు అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే న్యాయ పరంగా  సవాళ్లు తలెత్తే  అవకాశం ఉందని, ప్రజల కు సంబంధించిన న్యాయపరమైన హక్కులకు భంగం వాటిల్లుతుందని, అందువల్ల వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని వారు  కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన ఈ విషయాన్ని పరిశీలిస్తామని వారికి హామీ ఇచ్చారు.  సిఎం హామీ ఇవ్వడం ఆనందదాయకమని  కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగ్గుల గురప్ప నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రద్యున్మ ఐఏఎస్ ను కూడా కలిసి సమస్యను వివరించినట్లు ఆయన తెలిపారు. సీఎం తో చర్చించి ఎన్డిపిఎస్ కోర్టులను ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో అక్కడే విచారణ జరిగేటట్లు చూడాలని  కోరమన్నారు.

➡️