ప్రజాశక్తి * ఆదోని: భారతీయ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ సేవలు చిరస్మరనియం అని ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. ఆమె జయంతి సందర్భంగా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఫాతిమా షేక్ బాలికల చదువు కోసం ఎంతో కృషి చేశారన్నారు. సావిత్రి భాయితో కలిసి, ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారని గుర్తు చేశారు. నాగరికత లోపం ఉన్న ఆరోజుల్లో ఎన్నో అవమానాలు, భౌతిక దాడులు, వేధింపులకు గురి అయినప్పటికీ వారి లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదన్నారు ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే ఆమె గౌరవించబడ్డారని కొనియాడారు . ఇలాంటి మహిళా మణుల సేవలు ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.