బీమా రంగంలో ఎఫ్‌ డి ఐ పెంపు అవాంఛనీయం : ఎల్‌ ఐ సి ఉద్యోగులు నిరసన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కేంద్ర ఆర్థికశాఖా మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుండి 100% కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అనవసరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివఅద్ధికి అవసరమైన మూలధన సమీకరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ చర్య వల్ల ప్రభుత్వ విధానాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయాన్ని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఖండిస్తోంది మరియు ఈ చర్యకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరిస్తుందనీ ఇన్స్యూరెన్స్‌ ఉద్యోగులు సంఘం నాయకులు తెలిపారు. మంగళవారం ఎల్‌ ఐ సి కార్యాలయం వద్ద ఎఫ్‌ డి .ఐ ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.తిరుమలరావు,అర్‌.అప్పలనాయుడు మాట్లాడుతూ … 1999 సంవత్సరంలో ఐ ఆర్‌ డి ఏ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీమా రంగాన్ని ప్రయివేటీకరించారు. ఈ చట్టం ద్వారా భారతీయ పెట్టుబడిదారులు విదేశీ భాగస్వాములతో కలిసి బీమావ్యాపారం నిర్వహించేందుకు అనుమతి పొందారన్నారు. ఆ సమయంలో ఎఫ్‌ డి ఐ పరిమితిని 26%గా నిర్ణయించారు, అయితే తరువాత దానిని 74% కి పెంచారు. ప్రస్తుతం, అనేక ప్రైవేట్‌ బీమా కంపెనీలు విదేశీ భాగస్వాములతో కలిసి జీవిత బీమా మరియు సాధారణ బీమా రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. వాస్తవానికి, భారతదేశంలో ప్రైవేట్‌ బీమా సంస్థలకు మూలధనం కొరత అనేది అసలు సమస్య కానే కాదు. ఈ సంస్థలు భారతదేశంలోని పెద్ద వ్యాపార సంస్థల చేత నియంత్రించబడుతున్నాయి, ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బహుళజాతి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న 74% పరిమితిని దాటి పెట్టుబడులు పెడతామని చెప్పే కంపెనీలు చాలా తక్కువ. వాస్తవానికి, మొత్తం బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రస్తుతం కేవలం 32% మాత్రమే ఉన్నాయన్నారు.హొ ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 100% విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ఎందుకు ముందుకు వచ్చింది అనే అంశం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ నిర్ణయం భారతీయ కంపెనీలు మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందన్నారు. విదేశీ భాగస్వామి కంపెనీ విడిపోయి, స్వతంత్ర కంపెనీహొహొహొస్థాపిస్తే, అది భారతీయ కంపెనీలపై మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న కంపెనీలను ప్రతికూల బిడ్స్‌ ద్వారా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశముందన్నారు. విదేశీ మూలధనానికి పూర్తి స్వేచ్ఛ మరియు అధిక చొరవ కల్పించడం వలన బీమాపరిశ్రమ యొక్క క్రమబద్ధమైన వఅద్ధికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందన్నారు. లాభాలమీద దఅష్టి కేంద్రీకరించి, ప్రజానీకానికి మరియు వ్యాపార సంస్థకు అత్యవసర భద్రతను అందించే లక్ష్యాన్ని విస్మరించవచ్చునన్నారు. దీనివలన భారతీయ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.హొహొఅంతేకాకుండా, విదేశీ మూలధనం దేశీయ పొదుపుకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. హొకావున, దేశీయ పొదుపులను విదేశీ మూలధనానికి అప్పగించడంవలన ఎటువంటి ఆర్థిక లేదా సామాజిక ప్రయోజనం ఒనకూరదన్నారు. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం కావడంతో, దేశ ఆర్థికాభివఅద్ధికి లబ్ధి చేకూరే విధంగా పొదుపులపై ప్రభుత్వ నియంత్రణ పెరగాలన్నారు. ఇప్పటికే,హొహొఉన్న బీమా చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.హొఈ మార్పులు భారతదేశాన్ని 1956 నాటి పరిస్థితికి తీసుకెళతాయి. ఆ సమయంలో బీమా వ్యాపారం ఆర్థిక వేత్తల ఆధీనంలో ఉండడం వలన ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రంగాన్ని జాతీయీకరించాల్సి వచ్చిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం బీమా రంగాన్ని మళ్లీ ఆర్థిక వేత్తలు, బ్యాంకర్ల చేతికి అప్పగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది ప్రజల పొదుపులను ప్రమాదంలోకి నెడుతుందన్నారు.హొఈ బడ్జెట్‌ కొద్దిమంది ధనికవర్గాలపై ఆధారపడి,హొహొఆర్థిక వఅద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది మరియు విస్తఅత ప్రజాస్వామ్య వర్గాల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందన్నారు.కార్పొరేట్‌ లాభాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, కార్మికుల వేతనాలు మాత్రం స్థిరంగా అలాగే ఉన్నాయనే వాస్తవాన్ని ఆర్థిక సర్వే ఎత్తి చూపిందన్నారు.హొకార్మికులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే విధంగా ఈ బడ్జెట్‌ ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. అలాగే, బీమా చట్టాలైన ”ఇన్సూరెన్స్‌ చట్టం-1938”,హొహొ”ఎల్‌ ఐ సి చట్టం-1956”, ఐ ఆర్‌ డి ఎ-1999 చట్టాలను సవరించాలనే తిరోగమన ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తోందన్నారు.బీమా పరిశ్రమను కార్పొరేట్‌ లాభాలకోసం కాకుండా ప్రజా ప్రయోజనాలను దఅష్టిలో ఉంచుకుని అభివఅద్ధి చేయాలనీ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను కార్పొరేట్‌ ప్రయోజనం కోసం కాకుండా,హొహొప్రజా ప్రయోజనాల కోసం మారుస్తూ, లాభాలకంటే, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగాలని కోరుతున్నామన్నారు.నిరసన కార్యక్రమంలో ఎల్‌ ఐ సి ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️