ప్రజాశక్తి-కనిగిరి: బీమా రంగంలో ఎఫ్‌డిఐని ఆపాలని ఎల్‌ఐసి ఏజెంట్లు యూనియన్ ఏఓఐ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి శాటిలైట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని బ్రాంచ్ మేనేజర్ పిసిహెచ్‌వి సుబ్బయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిటీ నాయకులు సిఎం కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీమా రంగంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని, వీటి వలన పాలసీదారులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్నారు. ఆదాయ పన్ను నుంచి ఎల్‌ఐసిని మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీమాలో, విస్టార్, వాహక్, త్రినిటీ, విట్రాక్, సమర్ద్, బిడ్డర్‌లను అమలు చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యులు పి మహేష్, డివిజన్ నాయకులు వికే రావు, కే అనుక్ బాబు, రాయళ్ల సుబ్బరాయుడు, మీనిగా మధుసూదనరావు, కైపు వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఓ నాయకులు ఎం చెంచిరెడ్డి, కే నారాయణ తదితరులు పాల్గొన్నారు.
