నవధాన్యాలతో భూసారం

Jun 8,2024 20:37

ప్రజాశక్తి- గంట్యాడ: ప్రతి రైతు నవధాన్యాలను ఉపయోగించడం వల్ల భూసారం పెరుగుతుందని డిపిఎం ఆనందరావు అన్నారు. శనివారం కొండతామరపల్లి ఆర్‌బికెలో రైతులకు నవధాన్యాలు గురించి వివరించి తయారు చేసే విధానాన్ని చూపించారు. వరి పంటకు ముందు ఒక ఎకరానికి 10 కేజీలను నవధాన్యాలు వేయడం వల్ల కార్భన్‌ పెరిగి భూసారం పెరుగుతుందన్నారు. దీని వల్ల రసాయనక ఎరువులు అధికంగా ఉపయోగించాల్సినవసరం లేదన్నారు. వరి పంటతో పాటు అపార పంటలు అధిక దిగుబడి వస్తుందన్నారు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, పచ్చిరొట్ట విత్తనాలు అన్నీ కలిపి వేయడం వల్ల వచ్చే ఉపయోగాలను రైతులకు వివరించారు. ఎమ్‌టి ఈశ్వరమ్మ, గాయత్రి, సీతారత్నం, జ్యోతి రైతులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: నవధాన్యాలు వేయటం వల్ల మట్టిలో భూసారం పెరుగుతుందని ఎఒ రవీంద్ర తెలిపారు. శనివారం మండలంలోని సంతగైరంపేట, వినాయకుపల్లి గ్రామాలలో రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవధాన్యాలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవ చ్చన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా వచ్చిన జనుములు, జిలుగులు, పిల్లి పెసరతో పాటు రైతుల వద్ద ఉన్న మినుములు, పెసలు ఉలవలు, కందులు, ఆకుకూర విత్తనాలు కూరగాయ విత్తనాలు కలిపి వరి సాగుకు ముందు ఎకరాకు 10 నుంచి 12 కేజీలు వేసినట్లయితే భూములో ఉన్న పోషకాలు పెరగడమే కాకుండా పంటకు అవసరమయ్యే పోషకాలు సిద్ధం చేసుకున్నందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎఎ రవి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎంటి కోటిబాబు, మల్లేష్‌ నాయుడు, చరణ్‌ రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️