సాంస్కతిక వైభవాన్ని చాటిిచెప్పేలా ఉత్సవాలు

Oct 1,2024 21:40

  ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  విజయనగరం సాంస్కతిక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. ఉత్సవాలు, అమ్మవారి సిరిమానోత్సవం తో ముడిపడిన పలు వేదికలను ఎస్‌పి వకుల్‌జిందాల్‌, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి జిల్లా కలెక్టర్‌ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ముందుగా పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం సిరిమాను తిరిగే ప్రాంతాలతో పాటు అయోధ్య మైదానం, సరస్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసే మాన్సాస్‌ గ్రౌండ్‌, క్రీడా పోటీలు నిర్వహించే విజ్జీ స్టేడియంను పరిశీలించారు. కార్యక్రమాలపై అధికారులు, ఎమ్మెల్యేతో చర్చించారు. విజ్జి స్టేడియంలో నిర్మాణం పూర్తయిన మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంను ఈనెల 10వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే విజయనగర ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పిలుపునిచ్చారు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, సాంస్కతిని చాటి చెప్పేలా, విభిన్నంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పర్యటనలో ఎఎస్‌పి సౌమ్యలత, డిఆర్‌ఒ ఎస్‌ డి అనిత, సిపిఒ పి..బాలాజీ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కాంతిమతి, మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య, ఆర్‌డిఒ కీర్తి, పైడితల్లి, ఆలయ ఇఒ ప్రసాదరావు, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, టిడిపి నాయకులు ఐవిపి రాజు పాల్గొన్నారు.

➡️