ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతాయుతంగా పనిచేయాలి : ఎంపీడీవో రాజు

Nov 27,2024 17:32 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ తమ వృత్తిలో బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని ఎంపీడీవో ఏ.రాజు పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో వీక్లీ రివ్యూ మీటింగ్ లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ తో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామాల వారీగా గుర్తించిన పనుల పైన, జరుగుతున్న అభివృద్ధిపైన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. కూలీల మస్తర్లను ఎప్పటికప్పుడు రోస్టర్ లో నమోదు చేసుకుంటూ రికార్డు రూపంలో సంబంధిత శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. విధుల్లో ఎవరు అలసత్వం వహించవద్దని బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో ఎం.మెహర్ ప్రకాష్, ఏపీవో జి.అరుణకుమారి, కన్సల్టెంట్ ఇంజనీర్ పి.ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️