ప్రజాశక్తి – కడప : కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎసిఎ అండర్- 12 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం వైఎస్ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో నిర్వహించిన మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో నెల్లూరు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 35.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని యోగేష్ సాయి 35, అరుణాచలం 29 పరుగులు చేశారు. అనంతరం 141 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 33.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో కడప జట్టు విజయం..కెఒఆర్‌ఎం క్రికెట్ మైదానంలో నిర్వహించిన వేరొక మ్యాచ్‌లో చిత్తూరు జట్టుపై ఏడు వికెట్ల తేడాతో కడప జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూ రు జట్టు 35.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని భువన్ సాయి 54, లలిత్ రెడ్డి ఇరగం 36 చేశారు. కడప జట్టులోని మోక్షజ్ఞ గౌడ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 158 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 25.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆజట్టులోని తాహిర్ 35, యోగాంజనేయులు 32, విష్ణువర్ధన్ 31 పరుగులు చేశారు.