ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : ఇటీవల వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా టపాసులు పేలి గాయపడిన రాఘవపురం, వడ్డెర కాలనీ చెందిన చంద్రగిరి నాగరాజుకు వసంత కృష్ణ ప్రసాద్ సైన్యం విజయబాబు ఆదేశాల మేరకు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం ఆదివారం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి ( పెద్దోడు), పవన్ కుమార్ రెడ్డి (మ్యాంగో మార్కెట్), ప్రణరు కుమార్ రెడ్డి, చామల కోటిరెడ్డి, ఉయ్యూరు బాలకృష్ణారెడ్డి మరికొంతమంది విజయబాబు సైన్యం పాల్గొన్నారు.
