సాయి సాధన చిట్‌ ఫండ్‌ సంస్థపై పై ఆర్థిక మోసం కేసు నమోదు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డు లో ఉన్న సాయి సాధన చిట్‌ ఫండ్‌ సంస్థ యజమాని, భాగస్వాముల పై ఆర్థిక మోసం కేసు నమోదు చేసినట్టు 1వ పట్టణ సిఐ ఎం. వి.చరణ్‌ తెలిపారు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ ఏలూరి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థ ఎం.డి.పాలడుగు పుల్లారావు, ఇతర భాగస్వాములపై చిట్టీలు సమయంలో సక్రమంగా నిర్వహించకుండా సేకరించిన మొత్తాన్ని దుర్వినియోగం చేసి, మోసపూరితంగా వ్యవహరించి పారిపోయారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చరణ్‌ తెలిపారు.

➡️