ప్రజాశక్తి-వేటపాలెం : ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గతమూడు రోజులుగా నిర్వహిస్తున్న నేషనల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్- 2024 పోటీలు సోమవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా శ్రీ వివేక హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అంద జేశారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఎఫ్ నేషనల్ సెక్రటరీ మాలిక్ మాట్లాడుతూ ఈనెల 7,8,9 తేదీల్లో నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహంగా సాగినట్లు తెలిపారు. గేమ్స్ ఆర్గనైజర్ కావూరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఖోఖో, క్రికెట్ పోటీల్లో తెలంగాణ విద్యార్థులు మొదటి బహుమతిని సాధించినట్లు తెలిపారు. వాలీబాల్ పోటీల్లో చీరాల విజ్ఞాన భారతి విద్యార్థులు, కబడ్డీ పోటీల్లో వేటపాలెం శ్రీ వివేక హై స్కూల్ విద్యార్థులు, కరాటే పోటీల్లో మదర్ థెరిసా హైస్కూల్ విద్యార్థులు, కరాటే జూనియర్స్ విభాగంలో ఉప్పుకుండూరు ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులు, నాంచాక విభాగంలో శ్రీవివేక హైస్కూల్ విద్యార్థి బంగారు పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేక హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వలేటి రాజశేఖర్, కరాటే మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
