గాజువాకలో అగ్ని ప్రమాదం – బేకరీ స్వీట్‌ షాప్‌ దగ్ధం

గాజువాక (విశాఖ) : గాజువాక సమీపంలోని చిన్నగంట్యాడ జగ్గు జంక్షన్‌ వద్ద గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బెంగళూరు అయ్యంగర్‌ బేకరీ స్వీట్‌ షాప్‌ లో షార్ట్‌ సర్క్యూట్స్‌ కారణంగా ప్రమాదం జరిగి దుకాణం మొత్తం దగ్ధమైంది. పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. దాదాపు రూ.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తుంది. గాజువాక పోలీసులు ఆరా తీస్తున్నారు.

➡️