గామన్‌ బ్రిడ్జిపై లారీ లో మంటలు

ప్రజాశక్తి-తాళ్లపూడి (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొవ్వూరు మధ్యగల గామన్‌ బ్రిడ్జిపై ఆదివారం ఉదయం లారీ వెనుక భాగంలో మంటలు చెలరేగి లారీ పాక్షికంగా అగ్నికి ఆహుతి అయింది. తెలంగాణలోని మిర్యాలగూడ నుండి కాకినాడ పోర్టుకు పలుగు రాళ్ళ లోడుతో వెళుతున్నానని లారీ డ్రైవర్‌ ఎల్‌. శ్రీశైలం తెలిపాడు. తన వెనకగా వస్తున్న వాహనదారులు లారీ వెనక భాగంలో మంటలు చెలరేగాయని తెలపడంతో లారీని బ్రిడ్జిపై ఆపు చేశాడు. ఒకానొక సమయంలో అయితే లారీ నుండి భారీ శబ్దాలు రావడంతో లారీలో ఏముందో తెలియక బ్రిడ్జిపై వెళుతున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. రాజమండ్రి కొవ్వూరు పట్టణాల నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మరింత భారీ ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేశారు. సుమారు గంటకు పైగా కొవ్వూరు రాజమండ్రి పట్టణాల మధ్య ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

➡️