ప్రజాశక్తి-చింతలపూడి(ఏలూరు-జిల్లా) : చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్‌కు భారీగా వరద ప్రవహాం వచ్చి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రిజర్వాయర్ ఇన్ ఫ్లో 6,393 క్యూసెక్కులు గాను, ఔట్ ఫ్లో 8,893 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎ.ఇ.ఇ. పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.36 అడుగులు చేరుకున్నట్లు తెలిపారు. గాను గొనెల వాగు బేసిన్ 349.13 అడుగులకు చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టి.ఎం.సి.లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.003 టిఎంసిలుగా వుందన్నారు.
