సంకల్ప – 2024 లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ప్రధమ బహుమతులు

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : కల్లం హరనాధరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ, గుంటూరువారు ఈ నెల 27 తేదీన జాతీయ స్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌ సంకల్ప – 2024 ను ఇంజనీరింగ్‌, డిప్లొమా విద్యార్థులకు కలిపి నిర్వహించగా, అందులో గుడ్లవల్లేరు ఏ.ఏ.ఎన్‌.ఎమ్‌ వి.వి.ఆర్‌.ఎస్‌.ఆర్‌ పాలిటెక్నిక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన విద్యార్థులు ఎ.వి.ఎస్‌.అక్షరు, ఎ.కఅష్ణ తేజ లు ప్రాజెక్ట్‌ ఎక్సిబిషన్‌ పవర్‌ జనరేషన్‌ యూసింగ్‌ రేనేవల్బుల్‌ సోర్సెస్‌ అనే అంశంపై ఇంజనీరింగ్‌ విద్యార్థులతో పోటీపడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రూ.2,000/- ల నగదును కూడా అందుకున్నారని ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బహుమతులు సాధించిన విద్యార్థులను, వారికి ప్రత్యేక శిక్షణను అందిచిన ఇ.సి.ఇ బ్రాంచ్‌ విభాగాధిపతి జివివి సత్యనారాయణను, అధ్యాపకులను యాజమాన్య సభ్యులు చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరావు వల్లూరుపల్లి, సెక్రటరీ కరస్పాండెంట్‌ సత్యనారాయణ రావు వల్లూరుపల్లి, కో సెక్రెటరీ కరస్పాండెంట్‌ వల్లూరుపల్లి రామకృష్ణ, ఎక్సుక్యూటివ్‌ మెంటర్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌.వి.రామాంజనేయులు, ప్రిన్సిపల్‌ అభినందించారు.

➡️