ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : వేటకు వెళ్లిన మత్స్యకార యువకుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి చెందిన సంఘటన ఉప్పాడలో చోటుచేసుకుంది. శనివారం స్థానికులు బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం … ఉప్పాడ పంచాయతీ పరిధిలో ఉన్న సూరాడపేటకు చెందిన సూరాడ అప్పారావు (19) శుక్రవారం సముద్రంపై వేటకు వెళ్లి వల విసిరే సమయంలో వల తాడు అప్పారావు కాళ్లకు తగులుకోవడంతో సముద్రంలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు గాలింప చర్యలు చేపట్టగా, వలకు యువకుడి మృతదేహం దొరికినట్లు స్థానికులు బంధువులు తెలిపారు. మత్స్యకార యువకుడు మృతి చెందడంతో సూరాడ పేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
